*వ్యాపారం బాగా 'సాగాలంటే' ఏం చేయాలి?
'రబ్బరు వ్యాపారం' చేస్తే సరి!
*'చస్తే ఏ గొడవా లేదు' అంటారు నిజమేనా?
కాస్త సవరణ. 'బీమా చేసి చస్తే ఏ గొడవాలేదు' అంటే బాగుంటుంది.
*నాయకులకు ఉపయోగపడేందుకు తిట్లలో శిక్షణ ఇవ్వడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. కమర్షియల్‌గా ఇది క్లిక్ అవుతుందంటారా?
నలుగురు తిడుతుంటే ఆ సంస్థకు అవే ఆశీర్వచనాలు అవుతాయి. దానికి కమర్షియల్ విలువ కూడా వచ్చి తీరుతుంది.
*స్టాక్ మార్కెట్‌లో నెగ్గుకు రావాలంటే...?
'స్టాక్'చాతుర్యం ఉండి తీరాలి.
*నాకు ప్రపంచ బ్యాంకుకే రుణమిచ్చినట్లు కల వచ్చింది. నిజంగా అదే జరిగితే?
అంతా 'కల'కలమే!
*కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టే కట్టడాలు కూడా రోజులు లెక్కపెడుతున్నట్లు నాసిరకంగా తయారవుతున్నాయి. బిల్లులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటున్నాయి. మీరు ఏమంటారు?
'గుడ్' వచ్చి 'బిల్లు'ను వెక్కిరించడమంటే ఇదే మరి!
*నాకు ఏ అర్హతా లేదు. మంచి తెలివితేటలూ లేవు. వ్యాపారం చేయమంటారా? ఉద్యోగం చేయమంటారా?
మీ ఒంటికి ఈ రెండూ సరిపడవు గానీ రాజకీయాల్లో చేరండి. అటు వ్యాపారం ఎఫెక్టూ వస్తుంది. ఉద్యోగమూ చేసినట్లు ఉంటుంది. పైన ఒకాయన తిట్ల ఇనిస్టిట్యూట్ పెడదామనుకుంటున్నాడట. అడ్రస్ కనుక్కుని వెళ్లి ఓ నాలుగు తిట్లు నేర్చుకోండి చాలు.

No comments:
Post a Comment