Showing posts with label pun/telugu. Show all posts
Showing posts with label pun/telugu. Show all posts

Friday, April 16, 2010

ఫన్‌కర్‌ ఫటాఫట్‌


* ఇండియాలో ఉన్నప్పుడు అమెరికా బాగుంటుందనిపించింది. తీరా అమెరికా వెళ్లాక ఇండియాయే బాగుందనిపిస్తోంది. కారణమేమిటంటారు?
-కాళీ ప్రసాద్‌రాజు మావులేటి, న్యూహాంప్‌షైర్‌, అమెరికా 'ఎవర్‌గ్రీన్‌' కళ్లద్దాలు వాడండి. అప్పుడు ఎక్కడుంటే అక్కడంతా పచ్చగా కనబడుతుంది.

* వ్యాపారంలో 'నగ్న' సత్యాలు చెబితే ఏమవుతుంది?
-కొక్కళ్ల మురళి, బాబీనగర్‌, జడ్చర్ల
మీది ఏ వ్యాపారమైనా ఫర్వాలేదు గాని... బట్టల వ్యాపారమైతేనే డేంజర్‌ సుమా!

* నేను అర్జంటుగా ఒక స్టేజీకి రావాలంటే ఏం చేయాలి?
- వి. సుందరం, చెన్నై
మైకు రిపేరింగ్‌ నేర్చుకుంటే సరి. వెంటనే స్టేజీ ఎక్కేయొచ్చు.

* కోట్లు ఖర్చు పెట్టే నిర్మాత ధరించకూడని పాత్ర ఏమిటి?
-ఆర్‌. విఘ్నేశ్వరరావు, హైదరాబాద్‌
భిక్షాపాత్ర

* బిల్లు లేని సెల్లు
- ఫసుల్‌ రహమాన్‌, నాగర్‌ కర్నూలు
అంతా 'ఫ్రీ'పెయిడే

*మంత్రి పదవి తొందరగా రావడానికి నాయకులు ఏం వ్యాపారం చేస్తారు?
-విశ్వనాథ లక్ష్మీశైలజ, విజయవాడ
పార్టీ ఫిరాయింపుల వ్యాపారం

* విజిలెన్స్‌ కమిషన్‌ రిపోర్టులో మీ పేరేమయినా ఉందా?
- వి.ఆర్‌.కె. హనుమంతరావు, రాణి, సంగారెడ్డి
ఎడాపెడా 'తినేసే' వినాయకుడి పేరే లేదు. నా పేరెలా ఉంటుంది. అయినా, ఐ.ఎ.ఎస్‌. అంటే ఐయాం సేఫ్‌ అనేవాళ్లూ ఉన్నారు తెలుసా.

* బాగుపడాలంటే కాంట్రాక్టరయితే మంచిదా? ఇంజినీరయితే మంచిదా?
- పాలగుమ్మి అనుదీప్‌, అలేఖ్య, నర్సాపురం
కాంట్రాక్టరయినా, ఇంజినీరయినా 'కమీషన్‌'ర్‌ అయితే కచ్చితంగా బాగుపడొచ్చు.

* మీరు ప్రతీదీ 'లైట్‌'గా తీసుకుంటారా?
- అబ్బూరి అంబరీష్‌, ఎన్‌జీఓ కాలనీ, హైదరాబాద్‌
తీసుకుందామనే ఉంటుంది గానీ వేయింగ్‌ మెషీన్‌ ఒప్పుకోదు కదా

* రణరంగం కన్నా నష్టదాయకమైంది;
- అయ్యగారి శ్రావణి, పావని, సనత్‌నగర్‌, హైదరాబాద్‌
రుణ రంగం

* అద్దాల వ్యాపారం బాగుండాలంటే?
-కొప్పినీడి ప్రసాద్‌, చింతలపల్లి
అందగత్తెల సంఖ్య పెరగాలి.

* చెట్లకు డబ్బుకాస్తే..
- డి. రామానంద్‌, కరీంనగర్‌.
అందరూ గురజాడను (ఏ)మార్చి 'చెట్టు'పట్టాల్‌ వేసుకుని 'కోశ'స్థులంతా నడువవలెనోయ్‌' అంటారు.

* అప్పు చేసి పప్పు కూడు తినడం అంటే?
-సయ్యద్‌ బాషా, పాత రాయచోటి
ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని చెట్టు కింద స్కూళ్లలో కంప్యూటర్లు పెట్టడం.

* పెట్టుబడి లేకుండా లాభాల పంట పండే వ్యాపారం?
- జోగిపర్తి ప్రసాద్‌, బుచ్చిరెడ్డిపాలెం.
ఎన్నికల్లో 'టిక్కెట్లు' ఇప్పిస్తాం రండి అని నమ్మించి డబ్బు కొట్టేయడం.

* 'చిదంబర' రహస్యం ఏమిటో?
-వాస్తు రామచంద్రారావు, నెల్లూరు
'విత్తం ప్రభూ' అనడమే!

* నాకింద వేలాది మంది పనిచేయాలంటే
-పి.వి. రమణ, తిరుపతి
ఆకాశ హర్మ్యంలో అన్నిటి కన్నా పై అంతస్తులో ఉండడమే.

Monday, April 12, 2010

ఫన్‌కర్‌ ఫటాఫట్‌


*వ్యాపారం బాగా 'సాగాలంటే' ఏం చేయాలి?
'రబ్బరు వ్యాపారం' చేస్తే సరి!

*'చస్తే ఏ గొడవా లేదు' అంటారు నిజమేనా?
కాస్త సవరణ. 'బీమా చేసి చస్తే ఏ గొడవాలేదు' అంటే బాగుంటుంది.

*నాయకులకు ఉపయోగపడేందుకు తిట్లలో శిక్షణ ఇవ్వడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. కమర్షియల్‌గా ఇది క్లిక్‌ అవుతుందంటారా?
నలుగురు తిడుతుంటే ఆ సంస్థకు అవే ఆశీర్వచనాలు అవుతాయి. దానికి కమర్షియల్‌ విలువ కూడా వచ్చి తీరుతుంది.

*స్టాక్‌ మార్కెట్‌లో నెగ్గుకు రావాలంటే...?
'స్టాక్‌'చాతుర్యం ఉండి తీరాలి.

*నాకు ప్రపంచ బ్యాంకుకే రుణమిచ్చినట్లు కల వచ్చింది. నిజంగా అదే జరిగితే?
అంతా 'కల'కలమే!

*కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టే కట్టడాలు కూడా రోజులు లెక్కపెడుతున్నట్లు నాసిరకంగా తయారవుతున్నాయి. బిల్లులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటున్నాయి. మీరు ఏమంటారు?
'గుడ్‌' వచ్చి 'బిల్లు'ను వెక్కిరించడమంటే ఇదే మరి!

*నాకు ఏ అర్హతా లేదు. మంచి తెలివితేటలూ లేవు. వ్యాపారం చేయమంటారా? ఉద్యోగం చేయమంటారా?
మీ ఒంటికి ఈ రెండూ సరిపడవు గానీ రాజకీయాల్లో చేరండి. అటు వ్యాపారం ఎఫెక్టూ వస్తుంది. ఉద్యోగమూ చేసినట్లు ఉంటుంది. పైన ఒకాయన తిట్ల ఇనిస్టిట్యూట్‌ పెడదామనుకుంటున్నాడట. అడ్రస్‌ కనుక్కుని వెళ్లి ఓ నాలుగు తిట్లు నేర్చుకోండి చాలు.

Wednesday, March 24, 2010

ఫన్‌కర్‌ ఫటాఫట్‌


ఏటీఏంలలో నెలకు ఆరు లావాదేవీల ఉచితమట. పరిమితి దాటితే రుసుము చెల్లించాల్సిందేనట. ఇదెక్కడి ఫిటింగ్‌ సార్‌?

'ఆరే'సుకోబోయి ఏడేసుకున్నాను హరీ అంటే ఇదే మరి. ఇప్పుడు నడుస్తున్నది బ్యాం'కింగ్‌'ల రాజ్యం. మర్చిపోకండి. ఆమాత్రం 'ఫిటింగ్‌'లు ఉండకపోతే ఎలా?
__________________________________
బట్టల సబ్బుల ప్రకటనల్లో తెల్ల బట్టలే వాడతారెందుకు?

జాగ్రత్త! గట్టిగా అనకండి... 'రంగు పడుద్ది'
________________________________________
తలాతోకా లేకుండా వ్యాపారం చేయొచ్చా?

తల లేకపోయినా ఫర్వాలేదేమో గాని తోక మాత్రం కంపల్సరీ.
_________________________________
వ్యాపారంలో అదృష్టాన్ని నమ్ముకోవాలా? దురదృష్టాన్ని తిట్టిపోయాలా?

అదృష్టాన్ని 'అమ్ముకోవాలి'!
_______________________________


మనిషి కోతి నుంచి పుట్టాడన్న డార్విన్‌ సిద్ధాంతాన్ని నమ్మవచ్చంటారా?

ఎవరికి వాళ్లు అద్దంలో చూసుకుని నిర్ణయించుకోవాల్సిందే.
____________________________
నిన్న సైకిల్‌ మీద తిరిగిన నాయకుడు ఇవాళ ఏసీ కార్లలో తిరుగుతున్నాడు. ఏ వ్యాపారం చేసి పైకొచ్చాడో వూహించగలరా?

ఈమాత్రం దానికి ఊహించడం ఎందుకు? 'గాలి'కొట్టు శుభవేళ... మెడలో రత్నాల మాల...
_________________________________
ఎవరూ ధరించలేని వస్త్రాలు?

మీరు కట్టుకుని వదిలేసినవే!
______________________________
రాజకీయమే మంచి వ్యాపారమంటాను. మీరేమంటారు?

'ముంచు' వ్యాపారం అంటాను.
_____________________________
సీఎం, మాజీ సీఎంల 'అక్రమారోపణల'పై మీరే విచారణ జరపాల్సి వస్తే?

ఎవరు ఎక్కువ ముట్టజెబుతారో చూశాకే రిపోర్టు ఇస్తా.
____________________