Wednesday, March 24, 2010

ఫన్‌కర్‌ ఫటాఫట్‌


ఏటీఏంలలో నెలకు ఆరు లావాదేవీల ఉచితమట. పరిమితి దాటితే రుసుము చెల్లించాల్సిందేనట. ఇదెక్కడి ఫిటింగ్‌ సార్‌?

'ఆరే'సుకోబోయి ఏడేసుకున్నాను హరీ అంటే ఇదే మరి. ఇప్పుడు నడుస్తున్నది బ్యాం'కింగ్‌'ల రాజ్యం. మర్చిపోకండి. ఆమాత్రం 'ఫిటింగ్‌'లు ఉండకపోతే ఎలా?
__________________________________
బట్టల సబ్బుల ప్రకటనల్లో తెల్ల బట్టలే వాడతారెందుకు?

జాగ్రత్త! గట్టిగా అనకండి... 'రంగు పడుద్ది'
________________________________________
తలాతోకా లేకుండా వ్యాపారం చేయొచ్చా?

తల లేకపోయినా ఫర్వాలేదేమో గాని తోక మాత్రం కంపల్సరీ.
_________________________________
వ్యాపారంలో అదృష్టాన్ని నమ్ముకోవాలా? దురదృష్టాన్ని తిట్టిపోయాలా?

అదృష్టాన్ని 'అమ్ముకోవాలి'!
_______________________________


మనిషి కోతి నుంచి పుట్టాడన్న డార్విన్‌ సిద్ధాంతాన్ని నమ్మవచ్చంటారా?

ఎవరికి వాళ్లు అద్దంలో చూసుకుని నిర్ణయించుకోవాల్సిందే.
____________________________
నిన్న సైకిల్‌ మీద తిరిగిన నాయకుడు ఇవాళ ఏసీ కార్లలో తిరుగుతున్నాడు. ఏ వ్యాపారం చేసి పైకొచ్చాడో వూహించగలరా?

ఈమాత్రం దానికి ఊహించడం ఎందుకు? 'గాలి'కొట్టు శుభవేళ... మెడలో రత్నాల మాల...
_________________________________
ఎవరూ ధరించలేని వస్త్రాలు?

మీరు కట్టుకుని వదిలేసినవే!
______________________________
రాజకీయమే మంచి వ్యాపారమంటాను. మీరేమంటారు?

'ముంచు' వ్యాపారం అంటాను.
_____________________________
సీఎం, మాజీ సీఎంల 'అక్రమారోపణల'పై మీరే విచారణ జరపాల్సి వస్తే?

ఎవరు ఎక్కువ ముట్టజెబుతారో చూశాకే రిపోర్టు ఇస్తా.
____________________

No comments:

Post a Comment