* వీఆర్‌ఎస్ ముందు నా కాపురానికి నేనే కార్పొరేటర్‌ని. కాని, ఇప్పుడు నాది కింద చెయ్యి అయిపోయింది. గుండె ఆగిపోతే బాగుండననిపిస్తోంది.
మిమ్మల్ని మీరు కార్పొరేటర్ అనుకున్నారు. అంతవరకు ఫర్వాలేదు కాని, ఈ వరసలో ఇతరుల్ని మేయర్ అంటారేమో? విష్ణుమూర్తి అంతటివాడే చేయి కింద పెట్టి ఇచ్చినవాణ్ని 'బలి' తీసుకున్నాడు. ఇదే సూక్ష్మంలో వ్యాపార మోక్షం.
__________________________________
* నేను నీతిగా వ్యాపారం చేస్తున్నా, కొందరు రౌడీలు వచ్చి మామూళ్లకోసం వేధిస్తున్నారు. వాళ్ల వ్యవహారం గురించి మీరేమంటారు?
రౌడీలకు అది 'మామూలే'. బందీగా పట్టుబడితే తప్ప ఇబ్బందిలేని, పెట్టుబడిలేని వ్యాపారమది.
___________________________________
* రాజకీయాలతో వ్యాపారం చేద్దామనుకుంటున్నా. ఏ రంగు చొక్కా వేసుకుంటే మేలు?
ఏ ఒక్క రంగు చొక్కాయో వేసుకుంటే పెద్దగా లాభం ఉండదు. సమయానుకూలంగా 'రంగులు' మార్చాలి. పొద్దున్నే 'వూసరవెల్లీ! నిన్ను దలంచి...' అని పద్యం పాడుకోవాలి.
___________________________________
* అంబానీలు, మిట్టల్స్, టాటాలు, బిర్లాలు... వీళ్లంతా ప్రపంచ శ్రీమంతులనే సవాలు చేస్తున్నారు. మరి మన దేశంలో పేదల సంగతో?
మన దేశంలోని పేదలూ ఇతర దేశాల పేదలతో పోటీపడుతున్నారుగా. వారికన్నా పై చెయ్యిగా ఉంటున్నారు.
___________________________________
* వ్యాపారానికి మదుపు ముఖ్యమంటారు. మరి పొదుపు చేయాలంటే ఏం చేయాలి?
ఖర్చులపై అదుపు
___________________________________
* న్యూ ఇయర్ రోజున నామిత్రుడ్ని మందు పార్టీ అడిగితే, ఏ 'మందు' కావాలో తీసుకో అంటూ మెడికల్ షాపునకు తీసుకెళ్లాడు. మీరేమంటారు?
ఏ'మందు'ను? నేనేమందును??
'మందు' ఎక్కువైతే మనిషి పలచనవుతాడు అని తెలిసే చేసి ఉంటాడు. అంతేకాదు, 'మందు' ఎక్కువైనా చివరికి అవసరమయ్యేది 'మందే'నన్న విషయం తెలిసిన జ్ఞాని మీ మిత్రుడు.
__________________________________
* కొంతమంది క్రికెటర్లు ఆటలో రాణించకుండా వాణిజ్య ప్రకటనల్లో రాణిస్తున్నారు. ఏమంటారు?
ఏదో రకంగా క్రికెట్ 'యాడ్'కొంటున్నారులే అంటాను.
__________________________________
* వ్యాపార విజయ రహస్యం?
కుడి చేత్తో పుచ్చుకోవాలి. ఎడమ చేత్తో ఇవ్వాలి.
__________________________________
* 'పులి'రాజు ఎవరు?
'షేర్' మార్కెట్
__________________________________
* వ్యాపారానికి, రాజకీయానికి తేడా?
దాచుకోవడానికి, దోచుకోవడానికి ఉన్నంత
__________________________________
* బిజినెస్ పార్టనరే లైఫ్ పార్టనర్ అయితే?
ఇంటా బయటా బిజీబిజీ, అంతా గజిబిజి
__________________________________
* నెహ్రూ కుటుంబీకుల జాబితా పేర్లు అన్నీ అయిపోయిన తర్వాత వైఎస్సార్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఎవరి పేర్లు పెడతారు?
రెండో 'వరస' మొదలవుతుంది. ఎందరో 'గాంధీ'లు అందరికీ పథకాలు అన్నది గొప్ప 'పథకం'.

No comments:
Post a Comment