Wednesday, January 20, 2010

letter to bill gates

ప్రియమైన బిల్ గేట్స్ గారికి,

ఉభయకుశలోపరి

నా పేరు Swamy. భారతదేశం లో ఉంటాను. నేను ఈ మధ్య వ్యక్తిగత అవసరాల కోసం ఒక
కంప్యూటర్ కొన్నాను. కానీదానితో నేను కొన్ని సమస్యలు ఎదుర్కుంటున్నాను,
నేను ఎదుర్కుంటున్న ఆ సమస్యలను మీ దృష్టి కి తీసుకునిరావటానికే ఈ నా
ఉత్తరం.

1. ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యాక, ఈమెయిలు ఓపెన్ చెయ్యాలంటే అక్కడ ఉన్న
password అనే చోట మేము అది టైపుచేసినా ****** అనేది మాత్రమె కనపడుతుంది.
మిగిలిన అని చోట్లా బాగానే ఉంది. ఆ password అంటే ఏమిటి? దాన్నిఎలా
తెలుసుకోవాలో నాకు అర్ధం కావటం లేదు. ఈ విషయం లో మీ సహాయం కావాలి.

2. ఒక్క సారి shutdown అనే బటన్ నొక్కిన తరువాత ఇక ఏమీ చేయలేక పోతున్నాను. ఎందువలన?

౩. start అనే బటన్ ఉంది కానీ stop అనేది లేదు. ఈ విషయం మీరు పరిశీలించ గలరు.

4. మెనూ లో run అని ఒక ఆప్షన్ ఉంది. ఆ run ని క్లిక్ చేసి ఎంత సేపు
రన్నింగ్ చేసినా sit అని రాలేదు. రన్నింగ్ చేసిచేసి నాకు అలుపు
వచ్చేసింది. ఈ విషయాన్నీ మీరు గమనించి సరిదిద్దగలరు.

5. మరో సందేహం... కంప్యూటర్ లో 're-scooter' అనే ఆప్షన్ ఏమైనా ఉందా. నా
కంప్యూటర్ లో నేను re-cycle అనేఆప్షన్ గమనించాను. కానీ నా దగ్గర scooter
మాత్రమే ఉంది. cycle లేదు.

6. అలాగే నా సిస్టమ్ లోని find అనే ఆప్షన్ సరిగ్గా పని చేయటం లేదు. ఈ
మధ్య మా ఆవిడ బీరువా తాళాలు పోగొట్టింది. వాటిని 'find' అని చెప్పి
సిస్టమ్ లో ఎంత సేపు వెదకినా కనిపించలేదు. అది సరిగ్గా పని చెయ్యటానికి
ఏం చెయ్యాలి?

7. మా అబ్బాయి 'మైక్రోసాఫ్ట్ వర్డ్ ' నేర్చుకున్నాడు. ఇప్పుడు
'మైక్రోసాఫ్ట్ సెంటెన్స్' నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. దాన్ని మీరు
అందించ గలరా?

నా పై ప్రశ్నలన్నిటికీ మీ సమాధానాన్ని నాకు ఉత్తరం రాయగలరు. ఒక వేళ మీరు
ఈ-మెయిల్ చేస్తే పైన నేను చెప్పిన password ప్రాబ్లం వలన నేను చదవలేను.
కాబట్టి ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్ లోనే పోస్ట్ చెయ్యండి.

ఇట్లు
భవదీయుడు

No comments:

Post a Comment