Thursday, September 23, 2010

సిల్లీపాయింట్‌


నుదుటిపై పడే మెలిదిరిగిన ముంగురులను (ఉదా: శోభన్‌బాబు రింగ్‌) ఇంగ్లిషులో 'పిన్‌కర్ల్స్‌' అంటారు. వాటినే 'స్పిట్‌కర్ల్స్‌' అని కూడా అంటారు. స్పిట్‌ అంటే ఉమ్ము. ఒక్కోసారి ఉమ్మితడితో కూడా ముంగురుల్ని అలా రింగు తిప్పుతారు కాబట్టి ఆ పేరు వచ్చింది.
* 22 కండరాలు సమన్వయంతో పనిచేస్తే కానీ తేనెటీగ కుట్టలేదు.
* పేకముక్కల్లోని నాలుగు ఆసుల్లోకీ ఇస్పేట్‌ ఆసు మీది గుర్తు బాగా పెద్దదిగా ఉంటుంది.
* అమెరికాలో 98 శాతం మంది ఇళ్లల్లో టీవీలున్నాయి. *Cow, sheep, pig, calf... ఇవన్నీ ఇంగ్లిషు పదాలు కావు జర్మన్‌ పదాలు.
beaf, mutton, pork... ఇవి ఫ్రెంచివారి నుంచి అప్పుగా తీసుకున్నవి.
 

'స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ' (కాగడా పట్టుకున్న) చేతి పొడవు 42 అడుగులు.
* మలాన్ని పరీక్షించేవారిని స్కాటాలజిస్టులంటారు.
* అంతర్జాతీయంగా ఎక్కడో ఒకచోట ప్రతి సెకనుకూ రెండు బార్బీబొమ్మలు అమ్ముడవుతున్నాయి.
* అపోలో-11 వ్యోమనౌకలో వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు తమతోపాటు 'ఓరల్‌-బి' కంపెనీకి చెందిన టూత్‌బ్రష్‌లను తీసుకెళ్ళారు.
* సెప్టెంబరు 20ని చైనాలో 'మీ పళ్లని ప్రేమించండి (లవ్‌ యువర్‌ టీత్‌ డే) దినం'గా పాటిస్తారు.
* ప్రపంచవ్మెుత్తమ్మీదా ఏడాదికి ఐదు కోట్ల కొత్త కార్లు రోడ్లపైకి వస్తున్నాయి.

జాన్‌ ఎఫ్‌.కెన్నెడీ వాడిన రాక్‌చెయిర్‌ని ఆయన చనిపోయాక వేలం వేస్తే దాదాపు రూ. 2 కోట్ల ధర పలికింది.
* అమెరికన్ల సగటు ఇంటర్‌నెట్‌ వినియోగం రోజుకు 70 నిమిషాలు.
* ఆరోగ్యవంతుడైన మనిషి సగటున ఒక రాత్రిలో నాలుగు కలలు కంటాడు.
* చలనచిత్ర చరిత్రలోనే టాయిలెట్‌ను ఫ్లష్‌ చేసే దృశ్యాన్ని తొలిసారి చిత్రీకరించిన దర్శకుడు అల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌. ఆ సినిమా 'సైకో'.
* పిల్ల ఈల్‌ చేపను 'ఎల్వర్‌' అనాలి.

మెక్సికన్‌ సొంబ్రెరో టోపీ ఎంత పెద్దగా ఉంటుందంటే అది పెట్టుకుంటే వర్షంలో తలతోపాటు మన ఒళ్లు కూడా తడవదు!
* మార్ల్‌బరో వెుదటి మహారాణి సారా చర్చిల్‌ ఇంగ్లిషు 'ఐ' అక్షరంపై ఎప్పుడూ చుక్కపెట్టేది కాదు.
* మనుషులు తినగలిగే/తినే పురుగుల రకాలు 1,462.
* అమెరికన్లకు బాల్‌పాయింట్‌పెన్‌ తొలిసారి పరిచయమైంది 1945 అక్టోబరులో. న్యూయార్క్‌లో వాటిని అమ్మితే తొలిరోజే పదివేల పెన్నులు అమ్ముడయ్యాయి.
* పాప్‌ రారాజు మైకేల్‌ జాక్సన్‌కి ఇష్టమైన రంగులు ఎరుపు, నలుపు.
* జెట్‌విమానాల శబ్దాన్ని దగ్గర్నుంచి వింటే టర్కీకోళ్లు ఆ సౌండుకే చనిపోతాయి
.


90 శాతానికి పైగా జాతుల నత్తగుల్లలపై ఉండే గీతలు గడియారం తిరిగే దిశలోనే ఉంటాయి. మిగిలిన కొద్దిశాతం జాతుల నత్తల్లో మాత్రం ఆ గీతలు అపసవ్య దిశలో ఉంటాయి.